అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

Jan 3,2024 10:43 #12th death, #Assam, #road accident

అస్సాం : అస్సాం గోలఘాట్‌ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దైవదర్శనానికి వెళ్తుండగా ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 25 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై గోలఘాట్‌ ఎస్పీ రాజెన్‌ సింగ్‌ మాట్లాడుతూ… బస్సు ప్రయాణీకులతో తిలింగ మందిర్‌కు వెళ్తుండగా కమర్‌ బందా వద్ద ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. బస్సులో ఇరుక్కు పోయిన 10 మృతదేహాలను వెలికి తీశామన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

➡️