పశ్చిమ బెంగాల్‌ రాజ్‌భవన్‌లో ముగ్గురు ఉద్యోగులపై ఎఫ్‌ఐఆర్‌

పశ్చిమ బెంగాల్‌ : పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సివి ఆనంద్‌ బోస్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు ఇచ్చేందుకు ప్రయత్నించిన మహిళా ఉద్యోగిని అడ్డుకున్న కేసులో రాజ్‌భవన్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులపై శనివారం కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… ఈ నెల 2న రాజ్‌భవన్‌లో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న మహిళ ఫిర్యాదు ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఆమెను ఒఎస్‌డి ఎస్‌ఎస్‌ రాజ్‌పుత్‌, ప్యూన్‌ సంత్‌ లాల్‌, కుసుమ్‌ ఛత్రీ అడ్డుకున్నారు. నిందితులపై ఐపిసి సెక్షన్‌ 341, 166 కింద కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 164 కింద మేజిస్ట్రేట్‌ ముందు బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

➡️