ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఐఎఎస్‌ అరెస్ట్‌

Apr 22,2024 00:54 #arest, #IAS

మద్యం కుంభకోణంలో రూ.200 కోట్ల మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఛత్తీస్‌గఢ్‌కి చెందిన మాజీ ఐఎఎస్‌ అనిల్‌ తుతే జాను, ఆయన కుమారుడు యష్‌ తుతేజాను ఇడి అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం సంబంధిత అధికారులు తెలిపారు.
ఫెడరల్‌ ఏజెన్సీ 2003 బ్యాచ్‌ అధికారిని శనివారం రారుపూర్‌లోని ఆర్థిక నేరాల విభాగం (ఇడబ్ల్యుఎస్‌) అవినీతి నిరోధక బ్యూరో కార్యాలయం (ఎసిబి) నుండి అదుపులోకి తీసుకుంది. ఆదాయ పన్ను శాఖ ఫిర్యాదు ఆధారంగా గతంలో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఇడి కొత్త మనీలాండరింగ్‌ కేసును దాఖలు చేసింది. ఈ కేసులో నేరపూరిత ఆదాయం రూ.2,161 కోట్లుగా ఇడి అంచనా వేసింది.

➡️