Train Accident: ఎక్స్‌ప్రెస్ ను ఢీకొన్న గూడ్స్

Jun 17,2024 10:37 #Train Accident, #West Bengal

ఐదుగురు మృతి – పలువురికి గాయాలు 

సిలిగురి : రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 25మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో అగర్తల-సీల్దా కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ (13174)ను గూడ్స్ రైలు ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు కతిహార్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ ఎక్స్ లో ఒక పోస్ట్‌ చేశారు. ”డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సిదేవా ప్రాంతంలో జరిగిన ఒక విషాద రైలు ప్రమాదం గురించి తెలుసుకుని షాక్ అయ్యాను. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టిందని తెలిసింది. డిఎం, ఎస్పీ, వైద్యులు, అంబులెన్స్‌లు మరియు విపత్తు బృందాలు రెస్క్యూ, రికవరీ, వైద్య సహాయం కోసం స్థలానికి చేరుకున్నాయి. యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించాం.” అని పేర్కొన్నారు.

➡️