ప్రభుత్వరంగ సంస్థల్ని నాశనం చేస్తున్నారు

Feb 6,2024 11:15 #Rahul Gandhi
  • మోడీ ప్రభుత్వంపై రాహుల్‌

రాంచీ : ప్రభుత్వ రంగ సంస్థల్ని మోడీ ప్రభుత్వం నెమ్మదిగా నాశనం చేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శిం చారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యారు యాత్ర రాంచీకి చేరుకుంది. సోమవారం రాంచీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘నరేంద్ర మోడీ ప్రభుత్వం నెమ్మదిగా ప్రభుత్వ రంగ సంస్థల్ని నాశనం చేస్తోంది. హెవీ ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఇసి) పనిచేయకూడదని కేంద్రప్రభుత్వం కోరుకుంటోంది. రాబోయే రోజుల్లో హెచ్‌ఇసి పేరు స్థానంలో అదానీ నేమ్‌ ప్లేట్‌ను పెడతారు. దాన్ని ప్రయివేటీకరించాలను కుంటున్నారు. నేను ఎక్కడికి వెళ్లినా పిఎస్‌యుకి చెందిన వ్యక్తులు పోస్టర్లు చేతుల్లో పట్టుకుని నిలబడడం చూస్తున్నాను. బిహెచ్‌ఇఎల్‌, హెచ్‌ఎఎల్‌, లేదా హెచ్‌ఇసి అన్నీ అదానీకి అప్పగించబడుతున్నాయి. ఇలాంటి వాటిని కాంగ్రెస్‌ ఎప్పటికీ అనుమతించదు. అదానీకి ఇలాంటి ఉచిత బహుమతులు లభించవు’ అని ఆయన అన్నారు. అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గిన చంపయీ సోరెన్‌ ప్రభుత్వానికి రాహుల్‌ అభినందనలు తెలిపారు.

➡️