బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తత : భాష ప్రతిపాదిత ఆందోళనలు

బెంగళూరు : కన్నడనాట మరోసారి భాష ప్రతిపాదిత ఆందోళనలు తీవ్రమయ్యాయి. నేమ్‌ బోర్డులు ఇతర భాషల్లో ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ … కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ముందు కన్నడ సంఘాలు ఉద్యమించాయి. దీంతో బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఎయిర్‌పోర్ట్‌ బయట కన్నడ భాషలో కాకుండా ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో నేమ్‌ ప్లేట్లు ఉంచడంపై కన్నడ రక్షా వేదిక అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ … బుధవారం ఉదయం ఆందోళన చేపట్టింది. కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌ బయట ఇతర భాషల నేమ్‌ బోర్డులను నిరసనకారులు ధ్వంసం చేశారు. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళనకారులను అడ్డుకొని… పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఇటీవల … యునెస్కో కెంపెగౌడ విమానాశ్రయానికి మోస్ట్‌ బ్యూటీఫుల్‌ ఎయిర్‌పోర్టుగా గుర్తింపు లభించింది. ఈలోపే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు బెంగళూరు వ్యాప్తంగా ఉన్న దుకాణాలకు ఫిబ్రవరి చివరినాటికి కన్నడ భాషలో నేమ్‌ ప్లేట్స్‌ గనుక ఉండకపోతే చట్టపరమైన చర్యలు తప్పవంటూ Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) హెచ్చరించింది.

➡️