దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ‘ఇండియా’ ర్యాలీ : జైరాం రమేష్‌

Mar 30,2024 18:08 #Jairam Ramesh, #Rally

న్యూఢిల్లీ : ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుని వ్యతిరేకిస్తూ ‘ఇండియా’ ఫోరమ్‌ ఆదివారం ర్యాలీ చేపట్టనుంది. రేపు ఢిల్లీలోని రాంలీల్‌ మైదాన్‌లో జరగబోయే మహా ర్యాలీలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొననున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జార్ఖండ్‌ మాజీ సిఎం హేమంత్‌ సోరెన్‌, ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు.. ఇవేకాక నాలుగైదు సమస్యలపై ఈ ర్యాలీ నిర్వహించనున్నాం. రేపు జరగబోయే ర్యాలీ ఏదో ఒక పార్టీకి చెందిన ర్యాలీ కాదు. పలు పార్టీలన్నీ కలిసి దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేపట్టిన ర్యాలీ. రేపు జరగబోయే ర్యాలీలో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి చంపారు సోరెన్‌ హాజరుకానున్నారు.’ అని ఆయన అన్నారు.

కాగా, ఆదివారం ఢిల్లీలో జరగబోయే మహా ర్యాలీలో కాంగ్రెస్‌ పార్టీ నుండి మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, సోనియా గాంధీలు పాల్గొననున్నారు. మహారాష్ట్ర నుంచి శరద్‌పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, ఉత్తరప్రదేశ్‌ నుంచి అఖిలేశ్‌ యాదవ్‌, బీహార్‌ నుంచి తేజస్వీయాదవ్‌, పశ్చిమబెంగాల్‌ నుంచి డెరెక్‌ ఓ బ్రియాన్‌, పంజాబ్‌ సిఎం భగవంత్‌ మాన్‌, డిఎంకె ఎంపి, ఫరూక్‌ అబ్దుల్లాలతో పాటు వామపక్ష పార్టీలకు చెందిన నేతలు పాల్గొననున్నారని ఆప్‌ మంత్రి గోపాల్‌ రారు తెలిపారు.

➡️