శ్రీలంకలో పర్యటించిన భారత రాయబారి

Dec 3,2023 15:12 #Indian envoy, #Sri Lanka

కొలంబొ  :    భారత రాయబారి శ్రీలంక ఉత్తర ప్రావిన్స్‌లో పర్యటించినట్లు భారత హైకమిషన్‌ ఆదివారం ప్రకటించింది. శ్రీలంక ప్రజల అభివృద్ధి మరియు శ్రేయస్సు కోసం భారత్‌ నిబద్ధతను కలిగి ఉందని ఈ ప్రకటన పేర్కొంది. భారత హై కమిషనర్‌ గోపాల్‌ బాగ్లే ఈ ప్రావిన్స్‌లో మూడు రోజుల పర్యటనను పూర్తి చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. నవంబర్‌ 29 నుండి డిసెంబర్‌ 1 వరకు జరిగిన పర్యటనలో ఆయనతో పాటు హైకమిషన్‌కి చెందిన సీనియర్‌ దౌత్యవేత్తలు కూడా ఉన్నారని ప్రకటించింది. హైబ్రిడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ ప్రాజెక్ట్‌ అమలుకు సంసిద్ధతను అంచనా వేసేందుకు హైకమిషన్‌ జాఫ్నా, నైనతివు, అనలతివు, డెల్ప్ట్‌లోని మూడు దీవులను సందర్శించినట్లు వెల్లడించింది. ఈ ద్వీపాల్లో నివాసముండే స్థానికుల ఇంధన అవసరాలను తీర్చేందుకు అవసవరమైన ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపింది.

➡️