మహువా నివాసానికి డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌  అధికారులు

Jan 19,2024 12:00 #Delhi Bungalow, #Mahua Moitra

న్యూఢిల్లీ :  తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రా  ప్రభుత్వను  బంగ్లా నుండి  ఖాళీ చేయించేందుకు శుక్రవారం అధికారులు  ఆమె నివాసానికి చేరుకున్నారు.    బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశిస్తూ ఈ వారం ప్రారంభంలో బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. మొయిత్రా తనంతట తాను బంగ్లాను ఖాళీ చేయకపోతే, అవసరమైతే బలగాలను ఉపయోగిస్తామని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌ ఆ నోటీసులో పేర్కొంది. ఆమెకు అవకాశం ఇచ్చామని, అయితే తాను అనధికార నివాసి కాదని నిరూపించడంలో ఆమె విఫలమయ్యారని పేర్కొంది.  ఢిల్లీలో ఆమెకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయించేందుకు డైరెక్టర్ ఆఫ్ ఎస్టేట్స్  ఇచ్చిన నోటీసులపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది.   వెంటనే ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించింది.  దీంతో  శుక్రవారం బంగ్లా ఖాళీ చేయించేందుకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌   విభాగ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. పార్లమెంటులో లంచం తీసుకుని ప్రశ్నలు అడిగారని ఆరోపిస్తూ గతేడాది డిసెంబర్‌ 8న ఆమెపై లోక్‌సభ బహిష్కరణ వేటు వేసింది.

➡️