మణిపూర్‌ అల్లర్లలో మరణించిన 19మందికి సామూహిక ఖననం

Dec 16,2023 10:36 #19, #killed, #Manipur

గువహటి : మణిపూర్‌ జాతుల ఘర్షణల్లో మరణించిన 19మంది కుకి-జో బాధితులను సామూహికంగా ఖననం చేశారు. కాంగ్‌పోక్పి జిలాల్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో బాధితుల కుటుంబ సభ్యులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజన ఐక్యతా కమిటీ ఈ సామూహిక ఖనన కార్యక్రమం నిర్వహించింది. మేలో ఘర్షణల్లో మరణించిన 60 మందిలో 19మంది మృతదేహాలను ఇంఫాల్‌లోని రెండు మార్చురీల నుండి తీసుకురాగా, మిగిలిన 41 మృతదేహాలను చురాచంద్‌పూర్‌ జిల్లాకు తరలించనున్నారు. వచ్చేవారం అంతిమ వీడ్కోలు నిర్వహించనున్నారు. ఈ ఘర్షణల్లో మరణించిన వారి అంత్యక్రియలను గౌరవంగా, మర్యాదగా పూర్తి చేయాల్సిందిగా సుప్రీం కోర్టు మణిపూర్‌ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.

➡️