Mayawati : నీట్‌ అనిశ్చితికి శాశ్వత పరిష్కారం చూపాలి

లక్నో :   నీట్‌లో నెలకొన్న అనిశ్చితి ప్రజల్లో అశాంతి, ఆందోళన, ఆగ్రహానికి దారితీసిందని బిఎస్‌పి చీఫ్‌ మాయావతి సోమవారం పేర్కొన్నారు. ఈ సమస్యకు కేంద్రం శాశ్వత పరిష్కారం చూపాలని ఆమె కోరారు. దేశంలో ఎప్పటికప్పుడు నిర్వహించే వివిధ పరీక్షల స్వచ్ఛతతో పాటు నీట్‌ పరీక్షలో నెలకొన్న అనిశ్చితి ప్రజల్లో తీవ్ర ఆందోళన, అశాంతి, ఆగ్రహానికి కారణమైందని ఎక్స్‌లో హిందీలో ట్వీట్‌ చేశారు. ఈ సమస్యకు త్వరిత మరియు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడం చాలా ముఖ్యమని అన్నారు.  ఉత్తరప్రదేశ్‌ సహా రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రాలు లీక్‌ కావడం, ప్రభుత్వ నియామకాల్లో అవినీతి చాలా తీవ్రమని,  విచారకరం మరియు ఆందోళన కరమని పేర్కొన్నారు.  అక్రమాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్య పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంగాని, రాజకీయాలు కానీ సరికాదని అన్నారు.

➡️