మా పార్టీ బిజెపిలో విలీనం కాదు : హెచ్‌డి కుమారస్వామి

Apr 21,2024 23:57 #BJP, #kumara swami

బెంగళూరు : బిజెపిలో జనతాదళ్‌ (సెక్యులర్‌) పార్టీ విలీనం అవుతుందనే వార్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు హెచ్‌.డి కుమారస్వామి స్పందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మా పార్టీని వేరే పార్టీలో విలీనం చేసే ప్రశ్నే లేదు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి ‘ అని ఆయన అన్నారు. ప్రధాని మోడీకి, దేవెగౌడకు మధ్య సంబంధాలపై ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘మోడీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో దేవెగౌడ సైతం ఆయనను విమర్శించారు. అయినా మోడీ ప్రధాని అయ్యాక దేవగౌడను కలిశారు. కాంగ్రెస్‌ను ఓడించే సత్తా మా పార్టీకే ఉంది. కాంగ్రెస్‌ పార్టీ పేరులో సెక్యులర్‌ అనే పదాన్ని తొలగించారు’ అని కుమారస్వామి విమర్శించారు.

➡️