యువరాజు ప్రధాని కావాలని పాక్‌ కోరుకుంటుంది : మోడీ

May 3,2024 01:10 #coments, #PM Modi, #Rahul Gandhi

గాంధీనగర్‌ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాలని, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని పాకిస్థాన్‌ కోరుకుంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. గురువారం గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం లో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్‌ హీనస్థితిలో ఉన్నందుకు పాకిస్థాన్‌ బాధపడుతోంది. కాంగ్రెస్‌ కోసం పాకిస్థాన్‌ నాయకులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇది ఎవ్వరికీ ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ఇప్పటికే అందరికీ తెలుసు. కాంగ్రెస్‌ పాకిస్థాన్‌ శిష్యుడని’ అని మోడీ అన్నారు. దేశంలో బలహీన ప్రభుత్వం ఉండాలని శత్రువులు కోరుకుంటారని తెలిపారు. అనంద్‌ పట్టణంలో ఆనంద్‌, ఖేడా లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థుల తరపున మోడీ ప్రచారం నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్‌ కోరుకుంటుం దని ఆయన అన్నారు. తాను 24 గంటలూ శ్రమించి 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తున్నానని మోడీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ తన 60 ఏళ్ల పాలనలో కేవలం 3 కోట్ల ఇళ్లకు తాగునీరు సరఫరా చేస్తే, తాను గత పదేళ్లలో 14 కోట్ల ఇళ్లకు తాగునీరు సరఫరా చేస్తున్నానని మోడీ చెప్పారు.

➡️