మహాత్మునికి నివాళులర్పించిన ప్రధాని

Jan 30,2024 15:45 #Gandhiji, #modi, #tribute

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ 76వ వర్థంతి (జనవరి 30) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతోపాటు ఇతర ప్రముఖులు కూడా గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘పూజ్య బాపుకి పుణ్యతిథి నాడు నివాళులర్పిస్తున్నాను. మన దేశం కోసం అమరులైన వారందరికీ నేను నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలు ప్రజలకు సేవ చేయడానికి మన దేశం కోసం వారు కన్నకలను నెరవేర్చడానికి మాకు స్ఫూర్తినిస్తాయి.’ అని మోడీ తన పోస్టులో పేర్కొన్నారు.

➡️