అండర్ వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ

Mar 6,2024 11:18 #Kolkata, #Metro train, #PM Modi, #start

కోల్ కతా : కోల్ కతాలో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ టన్నెల్ ను ప్రధాని బుధవారం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అందులో ప్రయాణించారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుడా ప్రయాణం చేస్తుంది. దీనిని హుగ్లీ నది అడుగున భాగంలో.. భారీ సొరంగం ఏర్పాటు చేసి నిర్మించారు. ఈ అండర్ వాటర్ మెట్రో నిర్మాణానికి.. దాదాపు రూ. 120 కోట్ల ఖర్చుతో నిర్మించారు. కోల్‌కతా ఈస్ట్‌ – వెస్ట్‌ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా.. 10.8 కి.మీ. భూగర్భంలో ఉంటుంది. ఇందులో హావ్‌డా మైదాన్‌ నుంచి ఎస్‌ప్లెనెడ్‌ స్టేషన్ల మధ్య 4.8 కి.మీ.ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ నిర్మించారు. . అండర్‌వాటర్‌ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది.

➡️