నేడు రాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్న ప్రధాని మోడీ

Jan 22,2024 12:08 #Ayodhya, #national

అయోధ్య : అయోధ్యలో నేడు (సోమవారం) ప్రధాని మోడీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. మధ్యాహ్నం 12.20 నుంచి 12.30 గంటల మధ్య సమయంలో విగ్రహ ప్రతిష్ట జరగనుంది. రాముని విగ్రహ ప్రతిష్ట సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పుష్పవర్షం కురిపించనున్నారు. ఈ వేడుకలో 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు పాల్గొనున్నారు. ఇక ఈరోజు జరగనున్న ఈ కార్యక్రమంలో దేశ విదేశాల్లోని ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, స్వామిజీలు పాల్గొననున్నారు. కాగా, ఈ విగ్రహ ప్రతిష్ట అనంతరం మోడీ భక్తులనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయోధ్యలోని కుబర్‌ తిలాలో ఉన్న శివ మందిర్‌ను సందర్శించనున్నారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. 

➡️