ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులో మంటలు

న్యూఢిల్లీ :    ఢిల్లీలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులో మంటలు చెలరేగాయి. ఢిల్లీలోని ద్వారక ఏరియాలోగల ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ఆదివారం స్కూల్‌కు సెలవు కావడంతో బస్సులన్నింటిని ఒకేచోట పార్క్‌ చేశారు.  అయితే పార్కు చేసి ఉన్న బస్సుల్లో ఒక బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పేశారని, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు.  బస్సులో మంటలు చెలరేగిన దృశ్యాలు  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

➡️