రాహుల్‌ గాంధీ ఓ ఫైటర్‌ : సుప్రీయా సూలే

పూణె  :  కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఓ ఫైటర్‌ అని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) ఎంపి సుప్రియా సూలే వ్యాఖ్యానించారు. భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) నోటీసుకు ”గౌరవంగా మరియు నిజాయితీగా” సమాధానమిస్తారని గురువారం పేర్కొన్నారు. ప్రధాని మోడీని కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి ఇచ్చిన పిర్యాదుపై ఇసిఐ రాహుల్‌ గాంధీకి షోకాజ్‌ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.

” రాహుల్‌ ఓ బలమైన, నిజాయితీ కలిగిన నేత. అతను గౌరవంగా, నిజాయితీగా సమాధానం ఇస్తాడని నాకు నమ్మకం ఉంది. అతను ఓ పోరాట యోధుడు, నిజాయితీ పరుడు కావున ఆయన నిర్భయంగా ఉండగలడు” అని సూలే వ్యాఖ్యానించారు. బిజెపి రాహుల్‌ కుటుంబం గురించి గతంలో చాలాసార్లు నిందించారని, అటువంటప్పుడు రాహుల్‌ వ్యాఖ్యానిస్తే బాధపడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

➡️