ఎంఇఎ తదుపరి ప్రతినిధిగా రణధీర్‌ జైస్వాల్‌ నియామకం

న్యూఢిల్లీ :    విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ)తదుపరి అధికార ప్రతినిధిగా సీనియర్‌ దౌత్యవేత్త రణధీర్‌ జైస్వాల్‌ నియమితులయ్యారు. బుధవారం అరిందమ్‌ బాగ్చి నుండి అధికార ప్రతినిధిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అరిందమ్‌ బాగ్చిని ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలకు భారత తదుపరి శాశ్వత ప్రతినిధిగా నియమితులైన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్‌ 23న కేంద్రం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

” అధికారాల బదిలీ జరిగింది. రంధీర్‌ జైస్వాల్‌ ఎంఇఎ అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు. నేను అంతర్జాతీయ వ్యవహారాలను చేపట్టనున్నాను” అని బాగ్చి ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఎంఇఎ నూతన అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ గతంలో న్యూయార్క్‌ కాన్సుల్‌ జనరల్‌గా పనిచేశారు.  న్యూయార్క్‌ యుఎన్‌లో పోర్చుగల్‌, క్యూబా, దక్షిణాఫ్రికా మరియు భారత శాశ్వత మిషన్‌ సభ్యులుగా సేవలందించారు.

➡️