ఆఫీస్‌కు వస్తేనే వేతన పెంపు : టిసిఎస్‌ మెలిక

Feb 4,2024 08:38 #increased, #officer, #salary, #TCs

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) ఉద్యోగుల వేతన పెంపు, పదోన్నతులకు మెలిక పెట్టింది. కార్యాలయాలకు వచ్చి పని చేసే వారికే ప్రోత్సాహాకాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. రిటర్న్‌ టు ఆఫీస్‌ నిబంధనలకు అనుగుణంగా జీతాల పెంపు, ప్రోత్సాహకాలు ఉంటాయని తమ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని అన్ని శాఖల హెడ్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆఫీసుల నుంచి పని చేస్తున్న వారి పనితీరు, ఉద్యోగులకు ఇచ్చే గ్రేడ్లు ఆధారంగా ప్రోత్సాహకాలను అమలు చేయాలని ఆదేశించింది. అదే విధంగా కొత్త ఉద్యోగులు వారికి కేటాయించిన కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన వారికే ఏడాదికి రూ.3 లక్షల కంటే ఎక్కు వేతనాలకు అర్హులను పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లోనే ఇంటి నుంచి పని విధానానికి టిసిఎస్‌ ముగింపు పలికినప్పటికీ.. కొందరూ ఇప్పటికీ హైబ్రిడ్‌ విధానంలో పని చేస్తున్నారు.

➡️