బెంగాల్‌లో సెక్స్‌ రాకెట్‌

Feb 24,2024 10:53 #Bengal, #BJP leader, #Sex racket

సూత్రధారి బిజెపి నేత అతడితో సహా 10 మంది అరెస్టు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో సెక్స్‌ రాకెట్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. బిజెపి స్థానిక నేత సవ్యసాచి ఘోష్‌ ఈ రాకెట్‌కు కీలకసూత్రధారిగా వ్యవహరించినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయనతో పాటు మరో 10 మందిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. హౌరా జిల్లాలోని ఒక హోటల్‌ను కేంద్రంగా చేసుకొని ఈ సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్నట్లు సీనియర్‌ పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు. కోర్టు వీరిని వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. అదే సమయంలో దుండగుల బారి నుంచి పలువురు బాలికలు, యువతులను కూడా కాపాడినట్లు చెప్పారు. మరోవైపు సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్న కాషాయ నేతలను కాపాడేందుకు బిజెపి యత్నిస్తోందని రాష్ట్రంలోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. అయితే తృణమూల్‌ నేతలు దారుణాలకు పాల్పడిన సందేశ్‌ఖలి సంఘటనల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ వ్యవహారాన్ని తృణమూల్‌ ముందుకు తెస్తోందని బిజెపి నేతలు ప్రత్యారోపణలు గుప్పించింది. అక్రమాలు, అవినీతి మయంలో మునిగిన ఈ రెండూ పార్టీలనూ తిరస్కరించాలని మరోవైపు వామపక్షాలు, ఇతర పార్టీలు ప్రజలను కోరుతున్నాయి.

➡️