ఎపిలో వెంటనే అక్రమ ఇసుక తవ్వకాలను ఆపండి : సుప్రీం

న్యూఢిల్లీ : ఎపిలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే ఆపేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే మైనింగ్‌ జరిగే ప్రదేశానికి వెళ్లి అక్కడి పనులను ఆపాలని చెప్పింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌ పై చర్యలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సుప్రీం తోసిపుచ్చింది. ” మీ చర్యలు అన్ని కాగితాలపైనే ఉన్నాయని, క్షేత్రస్థాయిలో కనిపించవు ” అని జస్టిస్‌ అభరు ఎస్‌ ఓఖా ఆగ్రహం వ్యక్తం చేశారు.

➡️