అసత్యాలతో అమిత్‌షా విద్వేష వ్యాప్తి : తేజస్వియాదవ్‌

May 24,2024 17:29 #Bihar, #Tejaswi Yadav

పాట్నా : బీహార్‌లో విద్వేషం వ్యాప్తి చేసేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్రానికి వస్తారని, ఆయన అసత్యాలతో విషం వెదజల్లుతారని ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్‌ విరుచుకుపడ్డారు. శుక్రవారం తేజస్వియాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘అసత్యాలు, విద్వేష వైఖరిని బీహార్‌ ఎన్నటికీ అనుసరించదు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన దిశగానే బీహార్‌ అడుగులు వేస్తోంది. గత పదేండ్లుగా ప్రధాని మోడీ బీహార్‌ అభివృద్ధి కోసం ఏం చేశారు?’ అని ఆయన ప్రశ్నించారు. కాగా, ఈ ఎన్నికల్లో కూడా ప్రధాని మోడీ కేవలం ఫొటోలకు ఫోజులు ఇవ్వడం, జెండాలు ఊపడం వరకే పరిమితమయ్యారని ఆర్‌జెడి నేత ప్రతాప్‌ యాదవ్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రధాని మోడీ నయవంచనతో బీహార్‌ని నట్టేట ముంచారని తేజస్వి సోదరి, పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి మీసా భారతి ఆరోపించారు.

➡️