ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. తప్పిన ప్రమాదం

Nov 23,2023 10:44 #Odisha, #Train Accident

ఒడిశా : ఒడిశాలో మరో ఘోర రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. ఒకే ట్రాక్‌పైకి ఒక్కసారిగా మూడు రైళ్లు దూసుకొచ్చాయి. అదష్టవశాత్తూ ఏ ప్రమాదం జరగలేదు. అయితే రైల్వే సిగలింగ్‌ వ్యవస్థలో లోపం వల్ల ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. సుందర్‌గఢ్‌ జిల్లాలోని రవుర్కెలా రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం రోజున వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో సహా రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. సంబల్‌పూర్‌-రవుర్కెలా మెము రైలు, రవుర్కెలా-ఝార్సుగూడ పాసింజర్‌ రైలు 100 మీటర్ల దూరంలో ఒకే లైన్లో ఎదురెదురుగా వచ్చాయి. మూడో రైలు పూరీ-రవుర్కెలా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇదే ట్రాక్‌పై ప్రయాణిస్తోంది. అయితే గుర్తించిన మెము-పాసింజరు రైళ్ల సిబ్బంది వంద మీటర్ల దూరంలో రైళ్లను నిలపడంతో పెను ప్రమాదం తప్పింది. రవుర్కెలా రైల్వే స్టేషనుకు కేవలం 200 మీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

➡️