Tragedy – నదిలో ఈతకు దిగి నలుగురు మహిళలు మృతి

Mar 31,2024 08:46 #died, #four members, #tamilnadu, #tragedy, #Women

తమిళనాడు : నదిలో ఈతకు దిగి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన శనివారం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. వేలూరు జిల్లాలోని గుడియాతంలోని ఆలయం దగ్గర ఓ నదిలో ఈతకు దిగిన నలుగురు మహిళలు గల్లంతయ్యారు. భక్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈతగాళ్ల సహయంతో మహిళల మృతదేహాలను బయటకు తెచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళల మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️