సందేశ్‌ఖలి కేసు నిందితుడు షాజహాన్‌ను సస్పెండ్‌ చేసిన టిఎంసి

కోల్‌కతా :   సందేశ్‌ఖలి కేసులో అరెస్టయిన పార్టీ నేత షేక్‌ షాజహాన్‌ను తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) సస్పెండ్‌ చేసింది. ఆయనపై ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. టిఎంసి సీనియర్‌ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నుంచి షేక్‌ షాజహాన్‌ను ఆరేళ్లు సస్పెండ్‌ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సవాలు విసిరారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్‌ భూషణ్‌ లాంటి నేతలపై చర్యలు తీసుకునే ధైర్యం మీకు ఉందా అని నిలదీశారు.

గత 55 రోజులుగా పరారీలో ఉన్న షాజహాన్‌ను ఉత్తర 24 పరగణాల జిల్లా మినాఖా నుండి గురువారం ఉదయం 3 గంటలకు బెంగాల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

➡️