నిరుద్యోగం, ధరల పెరుగుదల.. పార్లమెంట్‌ భద్రతా వైఫల్యానికి కారణం : రాహుల్‌ గాంధీ

Dec 16,2023 16:57

 

న్యూఢిల్లీ : దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగమే పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘనకు కారణాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ శనివారం అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో కాంగ్రెస్‌ గుజరాత్‌ యూనిట్‌ నేతలతో ఎన్నికల సన్నద్ధత సమావేశం అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘డిసెంబర్‌ 13వ తేదీన పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘన జరిగింది. కానీ ఎందుకు జరిగింది. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం. ఈ సమస్య వల్ల దేశం అట్టుడుకుతోంది. ప్రధాని మోడీజీ విధానాల వల్ల దేశంలో యువతకు ఉపాధి లభించకపోవడమే పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనలకు కారణం.’ అని ఆయన విమర్శించారు. కాగా, డిసెంబర్‌ 13వ తేదీన పార్లమెంటు లోక్‌సభలో జీరో అవర్‌లో ఇద్దరు దుండగులు పబ్లిక్‌ గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకి కలర్‌ స్మోక్‌ను వదిలి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనకు పాల్పడిన ఆరుగురి వ్యక్తుల్ని పోలీసులు అరెస్టుచేశారు.

➡️