‘అగ్నివీర్‌’గా ట్రైనింగ్‌ తీసుకుంటున్న యువతి ఆత్మహత్య

Nov 29,2023 08:39 #Agniveer, #Suicide

 

ముంబయి : అగ్నివీర్‌గా శిక్షణ తీసుకుంటున్న ఓ యువతి హాస్టల్‌ రూమ్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు సమాచారాన్ని పోలీసులు మంగళవారం తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన యువతి కేరళకు చెందిన అమ్మాయి. ఈమె అగ్నిపథ్‌ స్కీమ్‌ కింద అగ్నివీర్‌గా నేవీలో శిక్షణ తీసుకునేందుకు రెండువారాల క్రితం ముంబయి చేరుకుందని పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం ఆమె తన బారుఫ్రెండ్‌ని కలిసిందని, వారిద్దరూ గొడవపడ్డారని, ఆ తర్వాత అతను చనిపోతానని ఆమెను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. మరి ఏమైందో ఏమో కానీ.. ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. మలాడ్‌ వెస్ట్‌లోని ఐఎన్‌ఎస్‌ హమ్లా బేస్‌లోని తాను ఉంటున్న హాస్టల్‌లో రూమ్‌లో తన మృతదేహం లభ్యమైందని పోలీసులు పేర్కొన్నారు. మల్వాని పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

➡️