అల్వాల్‌లో డీసీఎం వ్యాన్‌ బీభత్సం.. బాలుడు మృతి

Feb 8,2024 18:40 #road accident

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ అల్వాల్‌లో గురువారం మధ్యాహ్నం డీసీఎం వ్యాన్‌ బీభత్సం సృష్టించింది. అల్వాల్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌కు సరుకులతో వచ్చిన డీసీఎం ఒక్కసారిగా అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. దీంతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లీకుమారులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తిరుపాల్‌(9)ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తల్లి గాయాలతో చికిత్స పొందుతోంది. మఅతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక ప్రమాదం జరిగిన వెంటనే డీసీఎం డ్రైవర్‌ ఘటనాస్థలి నుంచి పరారీ అయ్యాడు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

➡️