ఆ నోటీసులు కోమటిరెడ్డికే పంపండి: కేటీఆర్‌

Jan 31,2024 15:15 #KTR, #tweets

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల మాజీ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పందించారు. సిరిసిల్లలో చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తానని ఆయన పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ ‘ఎక్స్‌’ (గతంలో ట్విటర్‌)లో కౌంటర్‌ ఇచ్చారు.”నోటీసులు ఎందుకు తప్పుగా ఇస్తున్నారు? పీసీసీ అధ్యక్ష పదవి కోసం మీకు రేవంత్‌రెడ్డి రూ.50కోట్లు లంచం ఇచ్చారని గతంలో మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఆన్‌ రికార్డుగానే ఆయన ఆరోపణలు చేశారు. పరువునష్టం నోటీసులు నాకు కాదు.. సచివాలయంలో కూర్చొన్న కోమటిరెడ్డికి పంపండి” అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

➡️