ఉద్యోగుల భద్రతపై ఎందుకు చట్టాలు చేయట్లేదు?:బొప్పరాజు

విజయవాడ: ఉద్యోగుల భద్రత గురించి ఎందుకు చట్టసభల్లో చర్చించడం లేదు.. చట్టాలు చేయట్లేదని ఏపీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. విశాఖపట్నంలో తహసీల్దారు సనపల రమణయ్య హత్యను ఖండిస్తూ విజయవాడలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో బొప్పరాజు మాట్లాడుతూ.. ”ఇంటికి వెళ్లి మరీ ఒక రెవెన్యూ ఉద్యోగిని నరికి చంపారు. దోషులను వదిలేస్తే ఇలాంటి ఘటనలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. రెవెన్యూ ఉద్యోగి హత్యపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి” అని డిమాండ్‌ చేశారు.

➡️