ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

Mar 20,2024 22:35 #sarees seaze, #sattenapalli

– వైసిపి నాయకుడి దుకాణంలో చీరలు సీజ్‌

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ (పల్నాడు జిల్లా) :ఎన్నికల నిబంధనలను అతిక్రమించి ఓటర్లకు పంపిణీ చేసేందుకు వైసిపి నాయకుని దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 1680 చీరలను ఎన్నికల అధికారులు బుధవారం సీజ్‌ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని వావిలాల గోపాలకృష్ణయ్య కాంప్లెక్స్‌లో కెవిఆర్‌ మార్టు పేరుతో వైసిపి మండల నాయకులు సూపర్‌ బజార్‌ నిర్వహిస్తున్నారు. మహిళా ఓటర్లకు పంపిణీ చేసేందుకు భారీగా చీరలు తీసుకొచ్చారు. విషయం తెలిసిన టిడిపి నాయకులు కెవిఆర్‌ మార్ట్‌ ఎదుట ఆందోళన చేశారు. వైసిపి నాయకులూ అక్కడికి చేరుకోవడంతో ఇరు గ్రూపుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో టిడిపి నాయకులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు గ్రూపులను చెదరగొట్టారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వి.మురళీకఅష్ణ ఆదేశాల మేరకు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారి కెవిఎల్‌ నరసింహారావు దుకాణంలో తనిఖీలు చేపట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి బమ్మలతో ఉన్న చీరలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్క అట్టపెటలో 48 చీరల బాక్సులు ఉన్నాయి. 35 అట్టపెట్టలను అధికారులు సీజ్‌ చేసి తహశీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. షాపు పరిసర ప్రాంతాల్లో పోలీస్‌ బలగాలు మోహరించాయి.

➡️