ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని దుస్థితి : నక్కా ఆనంద్‌బాబు

Dec 16,2023 15:01 #nakka anand babu, #press meet

అమరావతి: రాజధాని అమరావతి విధ్వంసానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్పడి నాలుగేళ్లు అయిందని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌ బాబు గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ”ఏపీని జగన్‌ కామెడీ రాష్ట్రంగా మార్చారు. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారు. జగన్‌ టీమ్‌ అమరావతిని దోచేశారు. రాజధాని రైతులకు కౌలు ఇవ్వలేదు గానీ మూడు రాజధానులు ఎలా కడతారు? ప్రతిపక్ష నేతగా జగన్‌ ఆనాడు అమరావతిని స్వాగతించి అధికారం రాగానే మాట మార్చారు. అమరావతి, ఆంద్రప్రదేశ్‌కు ఉన్న బ్రాండ్‌ను జగన్‌ పాడుచేశారు. టిడిపి అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది” అని నక్కా ఆనంద్‌బాబు స్పష్టం చేశారు

➡️