వెబ్‌సైట్‌లో ఇంటర్‌ హాల్‌ టికెట్లు

Feb 24,2024 08:50 #haltickets, #inter exams

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు బోర్డు కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బోర్డు వెబ్‌సైట్‌ bieap.apcfss.in ద్వారా అభ్యర్థులు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని తెలిపారు. విద్యార్థులు పాత హాల్‌ టికెట్‌ నెంబర్‌ గానీ, పుట్టిన రోజు వివరాలతో గానీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. హాల్‌ టికెట్లపై ప్రిన్సిపల్‌ సంతకం ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించారు. మార్చి ఒకటి నుంచి 20 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 1,559 పరీక్షా కేంద్రాలను బోర్డు ఏర్పాటు చేసింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 10,52,221 మంది హాజరుకానున్నారు.

➡️