కాంగ్రెస్‌ మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు : కేటీఆర్‌

Feb 4,2024 16:45 #KTR, #speech

మల్కాజ్‌గిరి : కాంగ్రెస్‌ చార్‌సౌ బీస్‌ హామీలను చూసి ప్రజలు మోసపోయారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఉప్పల్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్త్రుతస్థాయి సమావేశంలో ఆయన పాల్గన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఉప్పల్‌ జోష్‌ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా? కాంగ్రెసోడు ఉన్నాడా? అర్థం కావడం లేదన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో గెలుపు మనదేనన్నారు. కాంగ్రెస్‌ను మల్కాజ్‌గిరిలో మడత పెట్టీ కొట్టుడేనన్నారు. 420 హామీలు చూసి జిల్లాలో జనం మోసపోయారన్నారు.కాంగ్రెస్‌ మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదని జనం తెలుసుకున్నారని చెప్పారు. వందరోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌ను బందపెట్టుడేనన్నారు. రేవంత్‌ రెడ్డి మాట్లాడే భాషను జనం చూసి అసహ్యించుకుంటున్నారన్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని.. లంకె బిందెలు కోసం దొంగలు తిరుగుతారన్నారు. గతంలో రేవంత్‌ రెడ్డి అదే కావచ్చని.. నాకైతే తెల్వదన్నారు. రేవంత్‌రెడ్డి లాగా తాము తిట్టగలుతామని.. మొన్నటి ఫలితాలు మన మంచికే వచ్చాయని అనుకుంటున్నానన్నారు. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందని.. నికఅష్ట కాంగ్రెస్‌ పాలన ఎలా ఉంటుందో జనానికి తెలుస్తుంది అన్నారు.

➡️