కుంచనపల్లి కట్ట చెక్‌పోస్ట్‌ వద్ద తెలుగు యువత కార్యకర్తల హడావిడి

Jan 23,2024 16:11 #bike rally, #telugu yuvatha

కుంచనపల్లి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తెలుగుయువత ఆధ్వర్యంలో కుంచనపల్లిలో తెలుగు యువత కార్యకర్తలు మంగళవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా కుంచనపల్లి కట్ట వద్దగల చెక్‌ పోస్ట్‌ వద్దకు చేరుకున్న తెలుగు యువత కార్యకర్తలు బాణసంచా కాల్చి కొద్దిసేపు హడావిడి చేశారు. చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న పోలీసుల సమాచారం మేరకు పోలీసుల క్యార్‌వ్యాన్‌ శబ్దం వినిపించడంతో తెలుగు యువత కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

➡️