కోదాడలో కోర్టు కాంప్లెక్స్‌ భవనాలకు శంకుస్థాపన చేసిన హైకోర్ట్‌ సీజే

Feb 24,2024 14:37 #court bhavanalu, #opened

హైదరాబాద్‌ : జిల్లాలోని కోదాడలో హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే శనివారం పర్యటించారు. నాలుగు కోర్టు కాంప్లెక్స్‌ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం సబ్‌ కోర్ట్‌, అదనపు కోర్టు సేవలను ప్రారంభించారు. ఆయన వెంట మరో నలుగురు న్యాయమూర్తులు కూడా ఉన్నారు.కాగా, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో జడ్జి ఎన్‌. రాజేశ్వరరావు సబ్‌ కోర్టు నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. అలాగే భూపాల పల్లి ఏరియాలోని కృష్ణ కాలనీలో జిల్లా కోర్టుకు కేటాయించిన 11 ఎకరాల స్థలాన్ని కూడా న్యాయమూర్తి పరిశీలించారు. అక్కడి నుంచి సబ్‌ కోర్టుకు చేరుకొని కార్యాలయాలను పరిశీలించారు. జిల్లా కోర్టులో మొక్కలు నాటి ఇ- కోర్టు సర్వీస్‌ సెంటర్‌ను ప్రారంభించారు.

➡️