క్రీడలను ప్రోత్సహించేందుకే ‘ఆడుదాం ఆంధ్రా’కి శ్రీకారం

Dec 9,2023 15:30 #aadudamu andhra, #amaravati

అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో యువతలో దాగిఉన్న క్రీడలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యువతలో క్రీడలను ప్రోత్సహించే విధంగా 9 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. మరో రెండు సంస్థలతో చర్చలు కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌, ప్రో కడ్డీ లీగ్‌, ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌, ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌, ఏపీ బ్యాడ్మింటెన్‌ అసోసియేషన్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక, పీవీ సింధు, ఆంధ్రా ఖో ఖో అసోసియేషన్‌, ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్‌, ఆంధ్రా వాలీబాల్‌ అసోసియేషన్‌ తోనూ ఒప్పందాలు చేసుకుంది.. ఈ సంస్థల నేతఅత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా టాలెంట్‌ సెర్చ్‌ చేపట్టనున్నారు.. ఇక, ముంబై ఇండియన్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో చర్చలు సాగిస్తున్నారు. రాబోయే ఐపీఎల్‌, పీకేఎల్‌, పీవీఎల్‌ సీజన్స్‌ లలో ఏపీ క్రీడాకారులకు అవకాశాలు కలిపించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

➡️