గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల పిటీషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం!

Jan 30,2024 15:25 #judgement, #telangana high court

తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మంగళవారం గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల పిటీషన్‌ పై హైకోర్టు విచారణ జరిపింది. దాసోజీ శ్రావణ్‌, సత్యనారాయణ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేసింది. ఎమ్మెల్సీలుగా నియమించాలనే కేసు తేలే వరకు స్టే ఇవ్వాలని ఈ సందర్భంగా కోర్టును పిటిషనర్స్‌ కోరారు. ఇక, ఇప్పటికే ఈ కేసులో ఇరు వాదనలు పూర్తి అయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకి తుది తీర్పును తెలంగాణ హైకోర్టు ప్రకటిస్తామని వెల్లడించింది. దీంతో కోర్టు ఎలాంటి తీర్పుపై అందరిలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. కాగా, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రొఫెసర్‌ కోదండరాం, అమీర్‌ అలీ ఖాన్‌ ను ఎమ్మెల్సీలుగా నియమించింది. ఈనేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ ఇద్దరితోనూ ప్రమాణం చేయించొద్దని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

➡️