గుంటూరు డయేరియా బాధితుల కోసం హెల్ఫ్‌లైన్‌ : ఏపీ మంత్రి రజిని

అమరావతి : గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి అనారోగ్యంపాలైన బాధితుల కోసంహెల్ఫ్‌లైన్‌ అందుబాదులోకి తీసుకొచ్చామని ఏపీ మంత్రి విడదల రజిని వెల్లడించారు. ఆదివారం గుంటూరులో ఆమె ప్రజారోగ్యంపై సమీక్ష నిర్వహించారు. కలుషిత నీరు తాగి మొత్తం 41 మంది డయేరియా లక్షణాలతో జీజీహెచ్‌లో చికిత్సకు వచ్చారని వివరించారు.వైద్యులు సకాలంలో స్పందించి వైద్య చికిత్సలు అందించారని, ఇప్పటికే 7గురు డిశ్చార్జ్‌ అయ్యారని వెల్లడించారు. మరో 32 మంది నమూనాలు పరీక్షలకు పంపారని పేర్కొన్నారు. ఘటనపై కలెక్టర్‌ సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. కాగా రెండు రోజుల కిత్రం కలుషిత నీరు తాడి 18 ఏళ్ల గిరిజన యువతి పద్మ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మఅతి చెందింది. దీంతో ప్రతిపక్ష టీడీపీ, జనసేన, ఇతర వామపక్ష నాయకులు ఆందోళన నిర్వహించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం ఆదివారం గుంటూరు సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేసింది.

➡️