APPSC: 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు

  • మళ్లీ పరీక్ష నిర్వహించాలి
  • హైకోర్టు ఉత్తర్వులు జారీ

ప్రజాశక్తి-అమరావతి : ఎపి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) 2018లో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. జవాబు పత్రాల మూల్యాంకనం రెండు సార్లు చేయడాన్ని తప్పుపట్టింది. పలుసార్లు మూల్యాంకనం చేయడం చట్ట వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపిక ప్రక్రియ ఆరు వారాల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తీర్పు వెలువరించారు. మాన్యువల్‌ విధానంలో మూల్యాంకనం చేశారని, ఒకసారి పేపర్లను దిద్దిన తర్వాత వెలువడిన ఫలితాలను గోప్యంగా ఉంచి రెండోసారి దిద్దిన వాటిలో నచ్చిన వారిని ఎంపిక చేశారంటూ దాఖలైన పిటిషన్లను అనుమతిస్తూ తీర్పు వెలువరించింది.

➡️