చంచల్‌ గూడ జైలును వేరేచోటుకు తరలిస్తాం: సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరోక కీలక ప్రకటన చేశారు. చంచల్‌ గూడ జైలును వేరే చోటుకు తరలిస్తామని తెలిపారు. జైలును విద్యా సంస్థగా మారుస్తామని, అక్కడ కాలేజీ, స్కూలును నిర్మిస్తామని చెప్పారు. రాజకీయాలు, అభివృద్ధి వేర్వేరని అన్నారు. రెండింటినీ వేరుగా చూడాలన్నారు. అభివృద్ధి కోసమే మున్సిపల్‌ శాఖను తన వద్ద ఉంచుకున్నానని తెలిపారు. తమ ప్రభుత్వం అభివృద్ధి పైనే పూర్తి దృష్టి పెడుతుందని చెప్పారు. హైదరాబాద్‌ లో ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

➡️