చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి

Jan 3,2024 17:02 #dwarakanadhreedy, #join tdp

మంగళగిరి: ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి బుధవారం టిడిపిలో చేరారు. ఆయన బావ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సునందరెడ్డి దంపతులు మినహా ఇతర కుటుంబసభ్యులంతా చంద్రబాబు సమక్షంలో టిడిపి గూటికి చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీరికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. ద్వారకానాథరెడ్డి మేనకోడలు అలేఖ్యరెడ్డి.. కీర్తిశేషులు సినీనటుడు నందమూరి తారకరత్న సతీమణి. 1994లో టిడిపి నుంచి ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దు కాగా, పలు మండలాలు రాయచోటిలో విలీనమయ్యాయి. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

➡️