జనసేన నేత పవన్‌తో ఎంపి బాలశౌరి భేటీ

తెలంగాణ : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలశౌరి శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన ఆయన త్వరలో జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే బాలశౌరి తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కు పంపించారు. పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యత దక్కకపోవడంతోనే ఆయన పార్టీ వీడినట్లు తెలిపారు. ఈరోజు జనసేన నేత పవన్‌తో బాలశౌరి భేటీ అయ్యారు. ఎపిలో తాజా రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. పార్టీలో చేరే తేదీతోపాటు, భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై పవన్‌తో చర్చించి వెల్లడించే అవకాశం ఉంది.

➡️