జాతీయస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు కోన విద్యార్థిని ఎంపిక

Dec 7,2023 17:26 #handball, #national

ప్రజాశక్తి -కలకడ :పరిషత్‌ ఉన్నత పాఠశాల కోనలో ఎనిమిదవ తరగతి చదువుతున్న జైనాబ్‌ ఖానం జాతీయస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోడెం చంగల్‌ రాయుడు తెలియజేశారు. ఈ పోటీలు ఢిల్లీలో ఈనెల 16 నుండి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారని తెలిపారు. ఇందుకుగాను శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయురాలు ఝాన్సీ రాణి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. క్రీడలలో ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహిస్తామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. విద్యార్థిని తండ్రి అల్లా బక్షు, ఉపాధ్యాయులు మహేశ్వరి ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️