టిఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి ఏ-ప్లస్‌ గ్రేడు

కందుకూరు: బెంగుళూరులోని న్యాక్‌ కార్యాలయం విడుదల చేసిన ఫలితాల్లో స్థానిక టిఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏ-ప్లస్‌ గ్రేడును కైవసం చేసుకుంది.ఫిబ్రవరి 14 మరియు 15వ తేదీల్లో కళాశాలను సందర్శించిన న్యాక్‌ బృందం కళాశాలలో అమలవుతున్న బోధనా పద్ధతులను, పరిశోధన సామర్థ్యాన్ని, మౌలిక వసతులను, విద్యార్థుల క్రీడా, సాంస్కృతిక , విద్యాపరమైన సామర్ధ్యాలను, కళాశాల పరిపాలనను, నాయకత్వాన్ని, కళాశాలలో చేపట్టిన హరిత కార్యకలాపాలను, పర్యావరణ అనుకూల విద్యను, సమాజానికి విద్యార్థులను ఉద్యోగాలకు, సమాజానికి దగ్గరగా తీసుకోవడంలో కళాశాల చూపుతున్న చొరవను పరిశీలించి కళాశాలకు ఏ-ప్లస్‌ గ్రేడ్‌ ఇచ్చారు.

వాస్తవానికి న్యాక్‌ బృందం గత సంవత్సరం మే నెలలో కళాశాలను సందర్శించి బి ప్లస్‌ గ్రేడును కేటాయించింది. కళాశాల విద్యా శాఖ కమీషనర్‌ ప్రోత్సాహంతో, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌.ఎం.రవికుమార్‌ గ్రేడ్‌ పున్ణపరిశీలనకై న్యాక్‌ ప్రధాన కేంద్రానికి అప్పీలు చేశారు. ఈ విధంగా రాష్ట్రంలోనే న్యాక్‌ బఅంద పున్ణపరిశీలనకు అప్పీలు చేసిన మొట్టమొదటి కళాశాలగా కందుకూరు కళాశాల నిలిచింది. పరిశీలనకు వచ్చిన న్యాక్‌ బఅందం ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో కళాశాలను పున్ణసందర్శించింది. మూల్యాంకనం అనంతరం న్యాక్‌ విడుదల చేసిన ఫలితాల్లో, మన రాష్ట్రంలో ఉన్న 171 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 4 పాయింట్ల స్కేలుకు గాను, 3.44 అత్యధిక స్కోరుతో ఏ-ప్లస్‌ సాధించిన మొట్టమొదటి కళాశాలగా టిఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల-కందుకూరు నిలిచింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌.ఎం.రవికుమార్‌ ఈ విజయానికి కృషి చేసిన ఐక్యుఏసి విభాగాధిపతి డాక్టర్‌ పి. రాజగోపాల్‌ బాబు, విద్యార్థినీ విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని, అధ్యాపకేతర సిబ్బందిని, పూర్వ విద్యార్థులను దాతలను ప్రత్యేకంగా అభినందించారు. తమ విజయానికి సహకరించిన కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ డాక్టర్‌ పోలా భాస్కర్‌, అకడమిక్‌ గైడెన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌.తులసి, కళాశాల విద్యాశాఖలో పనిచేయుచున్న అకడమిక్‌ సెల్‌ అధికారులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

➡️