తప్పుల తడకగా శ్వేతపత్రం..ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్‌ కమిటీ వేయాలి : హరీశ్‌రావు

Dec 20,2023 15:06 #harishrao, #speech

హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనపడుతోందని ఆరోపించారు.”నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రం, ప్రజలు ఎంతో ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ ఎన్నో ఆశలు కల్పించడంతో.. ప్రజలు నమ్మి వారికి అధికారాన్ని కట్టబెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలి. ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగించాలి. శ్వేత పత్రంలో ప్రజలు.. ప్రగతి కోణం లేదు. ఇందులో రాజకీయ ప్రత్యర్థులపై దాడి.. వాస్తవాల వక్రీకరణే ఉంది. దీన్ని తెలంగాణ అధికారులు తయారు చేయలేదు. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక.. ఆంధ్రా అధికారులతో నివేదిక తయారు చేయించారు. ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్‌ కమిటీ వేయండి” అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

➡️