తిరుమలలో తగ్గిన యాత్రికుల రద్దీ.. శ్రీవారి ఆదాయం రూ. 2.40 కోట్లు

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు కంపార్ట్‌మెంట్లలో కాకుండా నేరుగా దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. శుక్రవారం స్వామివారిని 54, 523 మంది యాత్రికులు దర్శించుకోగా 20,817 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.40 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.

➡️