తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.58 కోట్లు

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.సోమవారం స్వామివారిని 67,568 మంది యాత్రికులు దర్శించుకోగా 22,084 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు హుండీలో సమర్పించుకున్న కానుకల ద్వారా టీటీడీకి రూ. 4.58 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో నిర్వహించనున్న కు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులను ఆహ్వానించేందుకు ఆహ్వాన పత్రికలు, ధార్మిక కార్యక్రమాలపై బుక్‌ లెట్‌ రూపొందించాలని డీపీపీ అధికారులను ఆదేశించారు.

➡️