తొలిరోజు విచారణ పూర్తి.. కవితపై ఈడీ ప్రశ్నల వర్షం

ఢిల్లీ : ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మొదటి రోజు విచారణ పూర్తి అయింది. తొలిరోజు ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ.. ఆమె స్టేట్‌ మెంట్‌ను వీడియో రికార్డింగ్‌ చేసింది. ‘ఆప్‌కు ఇచ్చిన 100 కోట్లు ఎక్కడినుంచి వచ్చాయి? ఎవరెవరు డబ్బు సమకూర్చారు? లిక్కర్‌ పాలసీ ద్వారా సంపాదించిన 192 కోట్లు మాటేంటి? ఇంకా ఎక్కడెక్కడ డబ్బు ఇన్వెస్ట్‌ చేశావు?’ అని కవిత కొనుగోలు చేసిన ఆస్తిపత్రాలను ఆధారాలుగా చూపించి అధికారులు ప్రశ్నించారు.
కవితను కలిసిన కేటిఆర్‌
విచారణ తర్వాత కవితను ఆమె భర్త అనిల్‌, సోదరుడు కేటీఆర్‌, బావ హరీశ్‌ రావు కలిశారు. కవిత యోగ, క్షేమాలను వీరు కనుక్కున్నారు. ఈ కేసులో న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్‌ రావు కూడా కవితను కలిశారు.

➡️